W.G: పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా పోలీసు కార్యాలయంలో విజయదశమి సందర్భంగా ఆయుధ, వాహన పూజలను ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఘనంగా నిర్వహించారు. చెడుపై మంచి విజయోత్సవంగా దసరా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు అప్రమత్తంగా సేవలందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ విశ్వనాథ్, డీఎస్పీలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ


