కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై బీజేపీ సెటైర్లు వేసింది. వియత్నాం వెళ్తున్న విమానంలో రాహుల్ ఉన్నారంటూ బీజేపీ ఓ వీడియోను Xలో పోస్ట్ చేసింది. దీనికి 'అబద్ధాలు ప్రచారం చేసి, బాగా అలసిపోయాను. నేను కొన్నిరోజులు వియత్నాంలో పర్యటిస్తాను. ఆ విషయం ఎవరికి తెలుస్తుందిలే' అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
రాహుల్ ఫ్లైట్ వీడియోతో బీజేపీ సెటైర్


