NRPT: మక్తల్ బ్రాహ్మణవాడలోని పురాతన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కల్యాణోత్సవం, రథోత్సవం వైభవంగా నిర్వహించారు. దశమి సందర్భంగా పద్మావతి అమ్మవారితో స్వామివారి కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా జరిపారు. అనంతరం రథోత్సవం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, గోవింద నామస్మరణతో ఆలయం మార్మోగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
తెలంగాణ
వైభవంగా స్వామివారి కల్యాణోత్సవం


