హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాలువలో పడి గల్లంతు.. మృతదేహం లభ్యం

MBNR: మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లిలో చెన్నకేశవులు సోమవారం కేఎల్‌ఐ కాలువలో ప్రమాదవశాత్తు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతైన విషయం తెలిసిందే. అధికారుల ఆధ్వర్యంలో చేపట్టిన గాలింపు చర్యల్లో మంగళవారం మృతదేహం లభ్యమైంది. భర్త మరణంతో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.