హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే తెల్లంను కలిసిన పోలీస్ అధికారులు

BDK: విజయదశమి సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావును ఆయన క్యాంపు కార్యాలయంలో డీఎస్పీ అరుణ్ కుమార్, సీఐ ఎస్. రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు పోలీస్ అధికారులు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణ శాంతిభద్రతలు, పండుగ వేళ ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు