NLG: దసరా పర్వదినం సందర్భంగా డిండి మండల కేంద్రంలోని మాంసం దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మటన్, చికెన్ కొనుగోలు చేసేందుకు వినియోగదారులు దుకాణాల వద్ద బారులు తీరారు. కిలో మటన్ రూ.1,000, చికెన్ రూ.300 చొప్పున విక్రయించినా కొనుగోళ్లు కొనసాగాయి. పండుగ నేపథ్యంలో మాంసం మార్కెట్లో సందడి నెలకొంది.
తెలంగాణ
మాంసం దుకాణాల్లో దసరా సందడి


