హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి కోత యంత్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

MHBD: దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో ఎరుకొండ రమేష్ అనే వ్యక్తి నూతనంగా కొనుగోలు చేసిన వరి కోత యంత్రాన్ని.. డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రామచంద్ర నాయక్ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. హార్వెస్టర్ వ్యవసాయ అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.