SRCL: కోనరావుపేట మండలం సుద్దాలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మంగళవారం భారీ నాగుపాము కలకలం రేపింది. పామును గమనించిన పాఠశాల యాజమాన్యం వెంటనే స్నేక్ క్యాచర్ జగదీష్‌కు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న జగదీష్ ఆరు అడుగుల నాగుపామును సురక్షితంగా పట్టుకున్నాడు. బతుకమ్మ, దసరా సెలవులతో పిల్లలు స్కూల్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయిందని గ్రామస్తులు అంటున్నారు.
తెలంగాణ
పాఠశాలలో భారీ నాగుపాము కలకలం


