హైదరాబాద్: 28°C
తెలంగాణ

108 వాహనంలోనే ప్రసవం

MDK: అల్లాదుర్గం మండలం కైదంపల్లి గ్రామానికి చెందిన వసంతలక్ష్మికి పురిటినొప్పులు రాగా కుటుంబసభ్యులు వెంటనే 108కు సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు తీవ్రమవ్వడంతో ఈఎంటీ నిఖిల్ భానుప్రియలు కాన్పు చేసి ఆడబిడ్డను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం తల్లీబిడ్డను జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పైలట్ మహేశ్వర్ తెలిపారు.