SDPT: బెజ్జంకి మండలం దాచారం గ్రామంలో సర్పంచ్ బైర మానస సంతోష్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామస్తులంతా డప్పు చప్పుళ్ల నడుమ ఉత్సాహంగా ఊరేగింపుగా జమ్మి చెట్టు వద్దకు చేరుకున్నారు. వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
తెలంగాణ
దాచారంలో భక్తిశ్రద్ధలతో దసరా వేడుకలు


