హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా రవీందర్‌రావు బాధ్యతలు

JGL: రాయికల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా కొండపల్లి రవీందర్‌రావు విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు స్వీకరించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సహకారంతో మార్కెట్ కమిటీని అభివృద్ధి చేస్తానన్నారు. రైతులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి, వారి సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు.