దసరా పండుగను పురస్కరించుకుని ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ బాబూలాల్ మాట్లాడుతూ.. మండల ప్రజలందరూ దసరా వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పండుగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ తరపున ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.
తెలంగాణ
పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ఆయుధ పూజా


