హైదరాబాద్: 28°C
తెలంగాణ

శమీ వృక్షానికి పూజలు నిర్వహించిన బండి

KNR: కరీంనగర్ మహాశక్తి ఆలయ ఆవరణలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి చెట్టు వద్ద శమీ పూజ చేసిన అనంతరం జమ్మి ఆకు (బంగారం) పంచుకుని ఆలయంలో ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.