హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండుగ పూట విషాదం!

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో పండగపూట విషాదం నెలకొంది. లింగాపూర్ గ్రామానికి చెందిన చల్లూరి సాయి వరుణ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న తల్లి రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.