హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనగామ పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజ

JN: విజయదశమి సందర్భంగా జనగామ పోలీస్ స్టేషన్‌లో సీఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఆయుధ, వాహన పూజలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ రాజమహేంద్ర నాయక్ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఎస్సైలు చెన్నకేశవులు, రతీష్, నర్సయ్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.