కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని శ్రీ దుర్గాభవాని ఆలయంలో విజయదశమి వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. పర్వదినం సందర్భంగా అమ్మవారు విజయలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ
విజయలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు


