హైదరాబాద్: 28°C
వార్తలు

రీల్స్ మోజులో కన్నవారు.. నీటిలో చిన్నారి!

సముద్ర తీరంలో రీల్స్ మోజులో పడిన తల్లిదండ్రులు తమ బిడ్డ భద్రతను గాలికి వదిలేశారు. అలల తాకిడికి చిన్నారి నీటిలో కొట్టుకుపోతున్నా వారు కెమెరా ముందు వీడియో చేయడంలో మునిగిపోయారు. అక్కడే ఉన్న వ్యక్తి సకాలంలో స్పందించి పాపను రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. సోషల్ మీడియా పిచ్చి పరాకాష్టకు చేరిందంటూ ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.