హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గులాబీ జెండాలతో ఎడ్లబండి ర్యాలీ..!

SRCL: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎడ్లబండి ర్యాలీతో సందడి చేశారు. గులాబీ జెండాలు చేతబట్టి పట్టణ పురవీధుల్లో ఎడ్లబండిపై తిరుగుతూ పండుగ ఉత్సాహాన్ని చాటిచెప్పారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.