హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా వేడుకలకు దూరమైన గ్రామం

SRPT: నూతన్‌కల్ మండలం చిల్పకుంటలో రాజకీయ ఆధిపత్య పోరు, పాత కక్షల కారణంగా 1980–85 మధ్యకాలం నుంచి దసరా వేడుకలు నిలిచిపోయాయి. సర్పంచ్‌కు కంకణాలు కట్టే సంప్రదాయం విషయంలో మొదలైన వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో గ్రామ పెద్దలు వేడుకలను నిలిపివేసినట్లు కథనం. నాలుగు దశాబ్దాలుగా పండుగకు దూరమైన గ్రామంలో దసరా సంబరాలు జరపాలని నేటి యువత కోరుతుంది.