NRML: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ ప్రజల జీవితాల్లో విజయాలు, సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహం, సానుకూల దృక్పథాన్ని నింపాలని కోరారు.
తెలంగాణ
నిర్మల్ జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు: కలెక్టర్


