హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు'

MBNR: 120 దేశాల పారిశ్రామికవేత్తలతో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతుందని టీపీసీసీ మైనారిటీ విభాగం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ సాధిఖ్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సమ్మిట్‌తో రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని, తెలియజేశారు.