హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాసర క్షేత్రంలో అంగరంగ వైభవంగా శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు!

NRML: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు. పూర్ణాహుతిలో భాగంగా నవ చండీ హోమంను ఆలయ వైదిక బృందం నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజు అమ్మవారికి ఆలయ అర్చకులు, వేద పండితులు మహా అభిషేకం చేసి, మంగళ వాయిద్య సేవ, పుణ్యాహ వాచనం కుంకుమార్చన లతోపాటు మహా హారతి కార్యక్రమాలను నిర్వహించారు.