హైదరాబాద్: 28°C
వార్తలు

నది శుభ్రతపై ఫోకస్.. మంత్రి వినూత్న అభ్యర్థన

యమునా నదిని శుభ్రంగా ఉంచే ప్రణాళికల్లో భాగంగా ఢిల్లీ మంత్రి పర్వేశ్ వర్మ ప్రజలకు వినూత్న పిలుపునిచ్చారు. పుట్టినరోజు వంటి ప్రత్యేక వేడుకలను యమునా తీరంలో జరుపుకోవాలని కోరారు. NOV 7న తన పుట్టినరోజును అక్కడే చేసుకోనున్నట్లు తెలిపారు. నదీ తీరాల్లో ప్రత్యేక కుటీరాలు ఏర్పాటు చేస్తామని, ప్రజలు నదితో వ్యక్తిగత బంధం ఏర్పరచుకుంటే దానిని కాపాడుకునే బాధ్యత తీసుకుంటారని అభిప్రాయపడ్డారు.