హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేజీ మటన్ రూ. 500.. కిక్కిరిసిన జనాలు

HYD: దసరా పండుగ నేపథ్యంలో HYD శివారు చెంగిచర్ల కబేళా రోడ్డు వాహనాలతో కిక్కిరిసిపోయింది. కేజీ మటన్ రూ. 500- 700 మధ్య లభిస్తుండటంతో నగరంతోపాటు దూర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. బైకులు, ఆటోలపై వచ్చిన కొనుగోలుదారులతో కబేళా పరిసరాల్లో రద్దీ నెలకొంది. పండుగ కొనుగోళ్ల కోసం జనం ఒక్కసారిగా పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.