SRD: తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కొనదొడ్డి నరసింహ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి, BCలు, SCలు, STలు, మైనారిటీల హక్కుల సాధనకు కృషి చేయాలని పార్టీ నాయకులు ఆకాంక్షించారు. నరసింహ నియామకం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
తెలంగాణ
TRP సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కొనదొడ్డి నరసింహ


