హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో దసరా ఉత్సవాలు ప్రారంభం

SDPT: బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకొని గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించారు. డప్పు చప్పుళ్ల నడుమ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణానికి చేరుకొని జమ్మి చెట్టును నాటి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జమ్మి ఆకులను బంగారంగా భావించి ఒకరికొకరు అందజేసుకుంటూ అలాయ్‌ బలాయ్‌ నిర్వహించారు.