హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోచారం ప్రాజెక్టులో తగ్గుతున్న నీటిమట్టం

KMR: పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో నీటిమట్టం 16 అడుగులకు తగ్గిందని ఏఈ అక్షయ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల నాటికి ప్రాజెక్టులో 1.044 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ఆవిరి రూపంలో 30 క్యూసెక్కుల నీరు తగ్గుతుండగా, ప్రధాన కాలువ ద్వారా 213 క్యూసెక్కుల నీటిని పంట పొలాలకు విడుదల చేస్తున్నట్లు వివరించారు.