PDPL: కమాన్పూర్ మండలం రొంపికుంట గ్రామంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో దుర్గామాత బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా డప్పు చప్పుళ్ల నడుమ భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: రొంపికుంటలో ఘనంగా దుర్గామాత బోనాల పండుగ


