హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆయుధ పూజ నిర్వహించిన ఎస్పీ అఖిల్ మహాజన్

ADB: విజయదశమిని పురస్కరించుకుని SP అఖిల్ మహాజన్ పోలీసు సాయుధ భాండాగారంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక ఆయుధ పూజలు, పోలీసు వాహన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి ఆయన విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో నిమజ్జన శోభాయాత్ర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.