ఆసిఫాబాద్ పట్టణంలోని మార్కెట్లో దసరా పండుగ సందడి నెలకొంది. విజయదశమి సందర్భంగా వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పట్టణానికి చేరుకుంటున్నారు. పండుగకు అవసరమైన పూలు, పూజా సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్ ప్రాంతం కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. పూలు, పూజా వస్తువుల దుకాణాల వద్ద రద్దీ పెరిగింది.
తెలంగాణ
VIDEO: ఆసిఫాబాద్ మార్కెట్లో దసరా సందడి


