హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా పండుగ.. ఆలయం వద్ద వాహనాల క్యూ

RR: కేశంపేట మండల కేంద్రంలోని మైసమ్మ తల్లి వద్ద దసరా పండుగ సందర్భంగా వాహనాలకు పూజలు నిర్వహించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. బైకులు, కార్లతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. వందలాది వాహనాలు బారులు తీరడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. వాహనదారులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.