హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంచి ఐడియా.. బతుకమ్మలతో ఎరువులు

VKB: రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకల్లో భాగంగా GHMC పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టింది. నగరవ్యాప్తంగా నిమజ్జనోత్సవాల అనంతరం సేకరించిన దాదాపు 5 మెట్రిక్ టన్నుల పూల వ్యర్థాలను కంపోస్టింగ్ యార్డులకు తరలించారు. ఈ వ్యర్థాలను నాణ్యమైన సేంద్రియ ఎరువుగా మారుస్తూ, వ్యర్థాల నుంచి సంపద సృష్టించే దిశగా జీహెచ్ఎంసీ ఆదర్శవంతమైన ముందడుగు వేసింది.