హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాల పొద్దుగాలనే వైన్స్ ఓపెన్

సిద్దిపేట జిల్లాలోని ముస్తాబాద్ చౌరస్తా సహా పలు ప్రాంతాల్లో వైన్స్‌ సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆబ్కారీ నిబంధనల ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే వైన్స్‌, బార్లు తెరిచి ఉంచాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా తెరుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.