హైదరాబాద్: 28°C
వార్తలు

‘సమాజంలో ఐదు మార్పులే 'పంచ పరివర్తన్' లక్ష్యం’

నాగ్‌పూర్‌లో(మహారాష్ట్ర) నిర్వహించిన RSS విజయదశమి వేడుకల్లో చీఫ్ మోహన్ భగవత్ కీలక ప్రసంగం చేశారు. సమాజంలో ఐదు కీలక మార్పులు తీసుకురావడమే 'పంచ పరివర్తన్' ముఖ్య లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఈ పంచ పరివర్తన్ ద్వారా ప్రజల జీవన విధానంలో సానుకూల మార్పు వస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా దేశంలో సామాజిక సామరస్యానికి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.