SDPT: విజయదశమి సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శమీ, ఆయుధ పూజలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దసరా పండుగ ప్రజల జీవితాల్లో ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజా సంక్షేమ పాలన దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటూ ప్రజలకు విజయాదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో శమీ పూజ


