హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాసర ఆలయంలో ప్రసాదం సరుకుల గోల్‌మాల్‌!

NRML: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రసాదం తయారీ కేంద్రానికి సంబంధించిన పెద్ద గోల్‌మాల్ వెలుగులోకి వచ్చింది. విలువైన సరుకులు మాయం కావడంతో స్థానికంగా కలకలం రేపింది. ప్రసాదం వస్తువులను కొందరు సిబ్బంది దొంగిలించి బయట దుకాణాల్లో విక్రయించినట్లు ఆధారాలు లభించాయి. ఈ ఘోరానికి పాల్పడిన వారిపై ఆలయ యంత్రాంగం కఠిన చర్యలు ప్రారంభించింది.