హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్‌కు పోటెత్తిన పత్తి, మిర్చి

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఇవాళ ఉదయం నుంచే పత్తి, మిర్చి పంటల రాక భారీగా పెరిగింది. దసరా పండుగ సెలవుల అనంతరం రైతులు పెద్ద ఎత్తున సరుకును విక్రయానికి తీసుకురావడంతో మార్కెట్ ప్రాంగణం కిటకిటలాడుతోంది. పత్తికి క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 7,200, మిర్చికి రూ.16,500 వరకు ధర పలుకుతోందని అధికారులు తెలిపారు. కమీషన్ ఏజెంట్లు మోసం చేయకుండా నిఘా ఉంచారు.