హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం రాక ముస్తాబైన కొండారెడ్డిపల్లి

NGKL: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ ప్రవేశ ద్వారం నుంచి నివాసం వరకు పూల అలంకరణలు, స్వాగత ఏర్పాట్లు ఆకట్టుకుంటున్నాయి. సీఎం రాకతో గ్రామంలో సందడి నెలకొంది. సీఎం పర్యటన దృష్ట్యా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.