హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

GDWL: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలకు, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఇవాళ దసరా శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, ధర్మం, న్యాయాల అంతిమ విజయానికి విజయదశమి ప్రతీక అని పేర్కొన్నారు. పోలీస్ శాఖ, ప్రజల మధ్య సత్సంబంధాలు, పరస్పర విశ్వాసం మరింత బలపడాలని, సమాజంలో శాంతిభద్రతలు కాపాడాలన్నారు.