KNR: శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర్లపల్లెలో సద్దుల బతుకమ్మ వేడుకల అనంతరం నిమజ్జనం సమస్యగా మారింది. చెరువులు, కుంటల్లో నీరు లేకపోవడంతో మహిళలు బతుకమ్మలను రోడ్డు పక్కనే వదిలి వెళ్లారు. రెండు రోజులైనా వాటిని తొలగించి, వేరే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా పాలకవర్గం చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డు పక్కనే బతుకమ్మలు.. పట్టించుకోని పాలకవర్గం


