హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సారెస్పీ నుంచి 12,170 క్యూసెక్కుల నీటి విడుదల

NZB: ఎస్సారెస్పీ నుంచి గడిచిన 24 గంటల్లో 12,170 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఇందులో కాకతీయ కాలువకు 4,500, లక్ష్మీ కాలువకు 285, మిషన్ భగీరథకు 231, సరస్వతి కాలువకు 800 క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 36.464 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు.