హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆయుధ, వాహన పూజలు నిర్వహించిన ఎస్పీ

BDK: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో ఆయుధ, వాహన పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పోలీసు ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. అందరూ సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.