హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నీరు లేక ఎడారిని తలపిస్తున్న కృష్ణా నది

GDWL: శ్రీశైలం ఎగువ ప్రాంతమైన గద్వాల పరిసరాల్లో కృష్ణా నది నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో నదిలో రాతి బండలు, ఇసుక మేటలు బయటపడి ఎడారిని తలపిస్తోంది. ఒకప్పుడు నీటితో కళకళలాడిన నది పరివాహక ప్రాంతాలు ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతున్నాయి. నది పరిస్థితి స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.