హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాత్యాయని అలంకరణలో దుర్గామాత

JGL: గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో వెలసిన శ్రీ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు కాత్యాయని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.