హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దాపురం మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని పరిణామం

KKD: పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అనుచరుడు అశోక్ కాంగ్రెస్ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా పోటీకి దిగడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ముందుగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన అశోక్, కూటమి ఛైర్మన్ టికెట్ దక్కించుకోవాలని యత్నించారు. అయితే ఆ టికెట్ జనసేనకు ఖరారు కావడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలవడం చర్చకు దారితీసింది.