హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా పండుగ వేళ... పాలపిట్ట కనిపించేనా..?

MHBD: దసరా పండుగ అనగానే మధురమైన జ్ఞాపకాల్లో పాలపిట్ట దర్శనం ఎంతో విశిష్టమైనది. విజయదశమి వేళ జమ్మి చెట్టు పూజ అనంతరం పాలపిట్టను దర్శించుకునేందుకు వెళ్లడం మన ఆచారం. పూర్వం రాజుల కాలంలో శమీ పూజ ముగించుకొని ఈ పక్షి దర్శనం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసేవారు. కానీ ఇవాళ దసరా పండుగ సందర్భంగా ఆ పాలపిట్టను చూద్దామన్న కనిపించని దయనీయ పరిస్థితి ఏర్పడింది.