హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీచ్‌కు తీసుకెళ్లి మైనర్ బాలికపై లైంగిక దాడి!

కోనసీమ: అయినవిల్లి మండలానికి చెందిన 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు SI జ్యోతి తెలిపారు. నిందితుడితో బాలికకు ఇన్ స్టా గ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ విషయం గమనించిన తండ్రి ఆమె ఫోన్ నుంచి యాప్‌ను తొలగించారు. ఆ తర్వాత నిందితుడు బాలికను ఓడలరేవు బీచ్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె పేర్కొన్నారు.