హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ADB: ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ రాజర్షిషా విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకైన ఈ పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహం, సానుకూల దృక్పథం కలగాలని కోరుతూ... ప్రజలందరూ కుటుంబంతో ఆనందంగా, సురక్షితంగా దసరా వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.