హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోపాల్‌నగర్‌లో దుర్గామాత శోభాయాత్ర

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకుని దుర్గామాత శోభాయాత్రను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక ఉత్సాహం నడుమ సాగిన ఈ శోభాయాత్రతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.