హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉట్నూరులో వీధి కుక్కల స్వైరవిహారం

ADB: ఉట్నూరు మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో వీధి కుక్కల బెడద పెరిగింది. వీధులతో పాటు కుమురం భీం మైదానంలో సాయంత్రం నడకకు వచ్చే వారిని కుక్కలు వెంటాడుతుండటంతో వాకర్లు భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ కరుస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.